CM Revanth Reddy : ఇంద్రవెల్లి నుంచి రేవంత్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం
నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోనిర్వహంచనున్నా తొలి బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Today, CM Revanth Reddy will fill Shankharavam for the parliamentary elections from Indravelli.
నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోనిర్వహంచనున్నా తొలి బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎం తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో.. పార్టీ నేతలు పెద్దయెత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు.. కాగా ఈ సభకు తెలంగాణ పునర్నిర్మాణం సభగా నామకరణం చేశారు. నేడు అధికారికంగా ఇంద్రవెల్లి (Indravelli) వేదికపై నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభ నుంచి మరో మూడు గ్యారంటీల అమలు దిశగా ఆయన ప్రకటన చేసే అవకాశముంది.
ఇప్పటికే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Minister Sitakka) అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పీసీసీ చీఫ గా తొలి సభను ఇంద్రవెల్లిలోనే రేవంత్ రెడ్డి నిర్వహించారు. అక్కడ కు చేరుకున్న తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్మృతి వనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఇంద్రవెల్లి నుంచే గళం వినిపించనున్నారు. ఇందుకోసం భారీ వేదికను కూడా ఏర్పాటు చేశారు.