ఈసారి రేవంత్ ఇంట్లో.. రెడీ అయిన టాలీవుడ్ పెద్దలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మరోసారి సినిమా పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సినిమా పరిశ్రమ పెద్దలు బేటి అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 06:37 PMLast Updated on: Jan 02, 2025 | 6:37 PM

Tollywood Meeting In Cm Revanth Reddy House

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మరోసారి సినిమా పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సినిమా పరిశ్రమ పెద్దలు బేటి అయ్యారు. ఈ భేటీ తర్వాత ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరోసారి సినిమా ప్రముఖుల భేటీ ఉంటుందని ఆయన ప్రకటించారు. సినిమా హబ్ గా హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఏం చేయాలో దానికి… ఏం అవసరాలు ఉన్నాయో ప్రతిపాదన రూపంలో తన ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి కోరినట్టు దిల్ రాజు వివరించారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు టాలీవుడ్ నుంచి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్ళాలి అనే అంశాలపై సినిమా పరిశ్రమంలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు వస్తున్న వార్తలు ప్రకారం ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు దిల్ రాజు అధ్యక్షతన ఒక కమిటీ రెడీ అయింది. అందులో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో బ్లాక్ టికెట్ దందాను ఆపేందుకు ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది.

ఆన్లైన్ టికెట్ ద్వారా బ్లాక్ టికెట్ దందాకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఆన్లైన్ టికెట్ విధానాన్ని అన్ని ప్రాంతాల్లోనూ అమలు అయ్యేలా దశలవారీగా చర్యలు చేపట్టాలని… ఈ విధానం అమలు కోసం… డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందనేలా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దానితో పాటుగా ఎప్పటినుంచొ పెండింగ్ లో ఉన్న మరోక విషయం… హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడానికి ఏం చేయాలనే దానిపై సీఎం సినిమా వాళ్ళని కోరారు రేవంత్.

దీనితో దీనికి సంబంధించి కూడా పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాల టికెట్ల ధరలు బెనిఫిట్ షోలకు వెసులుబాటు ప్రస్తావన వంటివి ప్రభుత్వం ముందు ఉంచడానికి టాలీవుడ్ మరోసారి రెడీ అయింది. అయితే సంక్రాంతి తర్వాత ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. అయితే భారీ బడ్జెట్ సినిమాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఏం చేయాలి ఏంటి అనే దానిపై దిల్ రాజు కూడా చర్చలు జరుపుతున్నారు. సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మాతగా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి బెనిఫిట్ షోలకు అనుమతి ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. టికెట్ ధరల పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు అంగీకరిస్తారనే దానిపై కూడా స్పష్టత రావటం లేదు. ఈసారి ఈ భేటీ రేవంత్ రెడ్డి ఇంట్లో జరగనుంది.