బెటాలియన్ పోలీసులా…లేదంటే కూలీలా ? ఒకే పోలీస్ విధానంపై నినదించిన భార్యలు
క్రమశిక్షణకు మారుపేరు...పోలీసు శాఖ. అలాంటి పోలీసు శాఖలో...కానిస్టేబుళ్లు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు.
క్రమశిక్షణకు మారుపేరు…పోలీసు శాఖ. అలాంటి పోలీసు శాఖలో…కానిస్టేబుళ్లు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. ఇష్టమొచ్చినట్లు డ్యూటీ వేయడాన్ని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు వ్యతిరేకిస్తున్నారు. బెటాలియన్ కానిస్టెబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీస్ శాఖ తాత్కలికంగా వాయిదా వేసింది.
తెలంగాణ వ్యాప్తంగా…పతుల కోసం సతులు ఆందోళన బాట పట్టారు. ఇష్టమొచ్చినట్లు డ్యూటీలు వేస్తున్నారంటూ…ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ఒకే రాష్ట్ర ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు డ్యూటీలకు పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి …తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే పోలీసింగ్ విధానం అమలయ్యే వరకు మెస్ తీసివేయాలని కోరుతున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని నినదించారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలని డిమాండ్ చేశారు. తమ భర్తలను కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ కానిస్టెబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీస్ శాఖ తాత్కలికంగా వాయిదా వేసింది. వారి కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సెలవుల రద్దు నిర్ణయం వాయిదా వేశారు. అలాగే బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించింది.
తమ భర్తలకు వారానికి ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని రిజర్వు పోలీసుల భార్యలు, పిల్లలు రోడ్డెక్కారు. నెలల తరబడి సెలవు లేకుండా డ్యూటీలు చేయిస్తుండటంతో…కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డ్యూటీలపై నిరసన బాట పట్టారు. వరంగల్ జిల్లాలోని మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు. మామునూరు బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అటు నల్గొండలో గ్రామీణ ఎస్‌ఐ సైదాబాబుకు…కానిస్టేబుళ్ల కుటుంబాల నుంచి నిరసన సెగ తగిలింది. ఎస్‌ఐ గోబ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబసభ్యులపై సైదాబాబు దురుసుగా ప్రవర్తించారని నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ పోలీసుల కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని…కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు డ్యూటీలు వేయడంతో…కుటుంసభ్యులతో గడపడానికి గంట కూడా సమయం ఇవ్వడం లేదంటున్నారు. డ్యూటీ ఎంత ముఖ్యమో భార్యపిల్లలనూ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. తమ పిల్లలకు జర్వం వచ్చినా వారాల తరబడి ఇళ్లకు రాకుండా…విధులు నిర్వహిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
పోలీసుల్లో 10% పోలీసులు…అధికారుల ఇళ్లలోనే పనులు చేస్తుంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కల్చర్ మాత్రం మారలేదు. ఒక ఎస్పీ ఇంట్లో…కనీసం పది నుంచి 12 మంది కానిస్టేబుల్స్ పనిచేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జీతంతో ప్రజలకు సేవ చేయాల్సిన కానిస్టేబుళ్లు…అధికారుల పెళ్ళాల వెనక కూరగాయలు మోయడం, ఇంట్లో పని చేయడానికే అంకితం అవుతున్నారు. డిజిపి నుంచి స్టేషన్ ఎస్ఐ వరకు ఇదే సంస్కృతి కొనసాగుతోంది. స్వాతంత్ర వచ్చినప్పటికీ…ఉన్నతాధికారుల తీరు అలాగే కొనసాగుతోంది. ఎస్పీకి 12 మంది పోలీస్ కానిస్టేబుల్ బానిసలు ఉంటే…ఎస్సైకి కనీసం ఇద్దరైనా ఉంటారు. ఈ సంస్కృతి ఇప్పటిది కాదు. ఎవరైనా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే…గ్రేహౌండ్స్ , పనిష్మెంట్ ఏరియాకు బదిలీ చేసేస్తారు. పోలీస్ అధికారులు ఇళ్లల్లో ఎంత నీచమైన పనులు చేస్తుంటారు అంటే… బట్టలు ఉతకడం, పిల్లల్ని స్కూల్ కు దించడం, తీసుకురావడం వంటివి చేయిస్తున్నారు. ఆఖరికి ఉన్నతాధికారుల కాళ్లు పట్టడం చేయిస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం కన్నా…కట్టు బానిస ఉద్యోగం చాలా బెటర్. ఈ కల్చర్ మారదు. మారితే పోలీసు అధికారు లకు ఫ్రీగా కూలీల దొరకరు.