TS 10Th EXAMS: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

వచ్చే మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పదో తరగతిలో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 07:49 PMLast Updated on: Dec 30, 2023 | 7:49 PM

Ts 10th Exams Shedule Released By Telangana Govt

TS 10Th EXAMS: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. వచ్చే మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

NALINI: వీళ్ల సంగతి చూడాలి అన్నా.. సీఎం రేవంత్‌కు నళిని సీక్రెట్‌ రిపోర్ట్‌..

ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పదో తరగతిలో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మరోవైపు తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.