TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. ఆ టిక్కెట్లు రద్దు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో టిక్కెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2023 | 08:30 PMLast Updated on: Dec 31, 2023 | 8:30 PM

Tsrtc Suspends Discounted Bus Tickets Of T6 Family 24 Within Hyderabad Suburban Limits

TSRTC: హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు షాకిచ్చింది టీఎస్‌ఆర్టీసీ. జనవరి 1 నుంచి ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదివారం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మీ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే, ఈ పథకం ద్వారా బస్సుల్లో రద్దీ పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

TTD: శ్రీవారి దర్శనం.. జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో టిక్కెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జనవరి 1 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. “ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది.

ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తన ఎక్స్ అకౌంట్‌లో వెల్లడించారు. ఈ టిక్కెట్ల ద్వారా 24 గంటలపాటు ఉచితంగా ప్రయాణించే వీలుండేది.