FREE POWER: అద్దెకు ఉండే వాళ్లకూ ఉచిత కరెంట్.. అర్హతలు ఏంటంటే..
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ (TSSPDCL) కూడా అధికారికంగా వెల్లడించింది. కిరాయికి ఉండే వాళ్ళకీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో TSSPDCL అధికారులు ట్వీట్ చేశారు.
FREE POWER: గృహజ్యోతి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే. పేద, అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఈ పథకం అమలుకానుంది. అయితే, సొంత ఇంట్లో ఉండే వాళ్లకే కాకుండా.. అద్దె ఇంట్లో ఉండేవారికి కూడా గృహజ్యోతి పథకాన్ని వర్తింప జేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
YS SHARMILA: దమ్ముంటే మోదీని ఇది అడుగు.. జగన్‌కు షర్మిల సవాల్..
ఈ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ (TSSPDCL) కూడా అధికారికంగా వెల్లడించింది. కిరాయికి ఉండే వాళ్ళకీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో TSSPDCL అధికారులు ట్వీట్ చేశారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ మాత్రమే వాడాలి. ఒక కుటుంబంలో ఒక కనెక్షన్‌కే గృహజ్యోతి అమలవుతుంది. వినియోగదారుల రేషన్ కార్డుకు, ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే 2022-23లో 2181 యూనిట్ల లోపు విద్యుత్ మాత్రమే వాడి ఉండాలి. ఈ పథకం ప్రకారం ఇంటి యజమానితోపాటు అద్దెకు ఉంటున్నవాళ్లు కూడా గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందొచ్చు. ఈ పథకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈనెల 8 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.
ఇప్పటివరకు ఈ పథకం కోసం 34,59,585 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్‌కే గృహజ్యోతి పథకం అమలు చేస్తారు. ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో వారి పేరుతోనే బిల్లు జారీ అవుతుంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు వివరాల సేకరణ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ అధికారులను ఆదేశించారు. ఇంటికే వచ్చి అధికారులు వివరాలు సేకరిస్తారు.