Kishan Reddy’s Nomination : 19న కిషన్ రెడ్డి నామినేషన్.. హజరుకానున్న మంత్రి రాజ్ నాథ్ సింగ్..
దేశంలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమిపిస్తున్నాయ్. ఈనెల 19న సికింద్రాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి (Union Minister) కిషన్ రెడ్డి (Kishan Reddy) నామినేషన్ ను వేయనున్నారు.

Union Minister Kishan Reddy's nomination on 19th of this month.. Defense Minister Rajnath Singh will come to this program..
దేశంలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమిపిస్తున్నాయ్. ఈనెల 19న సికింద్రాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి (Union Minister) కిషన్ రెడ్డి (Kishan Reddy) నామినేషన్ ను వేయనున్నారు. కాగా ఈ నామినేషన్ కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అనంతరం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు.
ఈ నెల 18న సాయంత్ర రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) హైదరాబాద్ కు రానున్నారు. ఇదే నెల 21న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని మెదక్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో యాదవ సంఘాలతో సీఎం మోహన్ యాదవ్ భేటీ కానున్నారు.
మరో వైపు సికింద్రాబాద్ (Secunderabad) బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన 10 సంవత్సరాల అభివృద్ధిని పూస గుచ్చినట్లు ఇంటింటికి వెళ్లి మరి చెబుతున్నారు..