Warangal BRS Leaders jumps : కాంగ్రెస్ లోకి ఆగని వలసలు… కారు దిగిపోతున్న వరంగల్ లీడర్లు !
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీలు, మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు నడిచారు. ఆ తరువాత గీసుగొండ ఎంపీటీసీలు, పరకాల ఎంపీపీ కూడా BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

Unstoppable migration into Congress... Warangal leaders getting down from the car!
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీలు, మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు నడిచారు. ఆ తరువాత గీసుగొండ ఎంపీటీసీలు, పరకాల ఎంపీపీ కూడా BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ వరంగల్లో పట్టు సాధించేందుకు కొందరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ నేతలు పరోక్షంగా వారి నుంచి సహకారం తీసుకున్నారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్‌లోనే ఉన్నారట. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తోందని పసిగట్టిన మేయర్ ముందు జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అలాగే 15 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారట. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు.
వీరితోపాటు వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొని దేనికైనా రెడీ అంటున్నారట. మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కూడా పొలిటికల్ పుట్టింటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి ఎదిగిన పద్మావతి తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె కండువా మార్చడం ఖాయమని తేలిపోయింది.
టేకుమట్ల జడ్పిటిసి తిరుపతిరెడ్డి కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరూ కండువా మార్చేస్తారట. ఇక అన్నిటికీ మించి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ కూడా పార్టీని వీడుతుండడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద కుదుపేనంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కారు పార్టీకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.