Aroori Ramesh: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..?
బీఆర్‌ఎస్ పార్టీకి విపరీతమైన బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు వర్ధన్నపేట్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Aroori Ramesh: ఏ ముహూర్తాన ఎన్నికల్లో ఓడిపోయిందో కానీ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో ఒక్కో నేత సైలెంట్‌గా పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు నేరుగా సీఎం రేవంత్‌తో భేటీ కాగా.. ఇప్పుడు వరంగల్‌కు చెందిన మరో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఓరుగల్లు జిల్లాలో ఓ కీలక సెగ్మెంట్‌ను బీఆర్‌ఎస్ కోల్పోయినట్టే.
Ysrcp Manifesto: వైసీపీ మేనిఫెస్టో ఆ రోజేనా.. వరాలు కురిపిస్తారా.?
బీఆర్‌ఎస్ పార్టీకి విపరీతమైన బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మంచి ఆఫర్ వస్తే కాంగ్రెస్ లేదా బీజేపీలోకి జంప్ ఐపోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు వర్ధన్నపేట్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో వర్ధన్నపేట్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఒకరు. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వర్ధన్నపేట్ టికెట్ రమేష్‌కే కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్. కానీ చాలా ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నేతల మీద వ్యతిరేకత ఉన్నట్టే రమేష్ మీద కూడా వర్ధన్నపేట్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నాగరాజు గెలిచారు. ఇటు ఎమ్మెల్యే పదవి పోయింది. అటు పార్టీ కూడా అధికారంలో లేదు. దీంతో ఇక బీఆర్‌ఎస్‌లో ఉండి లాభం లేదని రమేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే రమేష్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని టాక్. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే బీజేపీలోకి వెళ్లేందుకు రమేష్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఈ రకంగా చూస్తే రమేష్ బీజేపీకి వెళ్లడం ఒక రకంగా పార్టీకి కూడా కలిసి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. దీంతో రమేష్ విషయంలో పార్టీ పెద్దలు కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అనున్నవి అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరులోనే రమేష్ బీజేపీలో చేరే అవకాశమున్నట్టు టాక్. చూడాలి మరి గులాబీ బాస్‌ని వదిలి రమేష్ ఎప్పుడు ఎలా మస్కా కొట్టబోతున్నారో.