WGL BRS TICKET : BRSలో వరంగల్ పంచాయతీ.. మాల,మాదిగ నేతల యుద్ధం

వరంగల్ BRS అభ్యర్థిగా కడియం కావ్య తప్పుకోవడంతో ఇప్పుడు అక్కడ కొత్త కేండిడేట్ కోసం BRS వెతుకులాడుతోంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యకు టిక్కెట్ కేటాయిస్తే... ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. కొత్త అభ్యర్థి కోసం వరంగల్ BRS పార్టీలో మాల, మాదిగ నేతల మధ్య పోరు నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2024 | 12:46 PMLast Updated on: Apr 05, 2024 | 12:46 PM

Warangal Panchayat In Brs Battle Of Mala Madiga Leaders

వరంగల్ BRS అభ్యర్థిగా కడియం కావ్య తప్పుకోవడంతో ఇప్పుడు అక్కడ కొత్త కేండిడేట్ కోసం BRS వెతుకులాడుతోంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యకు టిక్కెట్ కేటాయిస్తే… ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. కొత్త అభ్యర్థి కోసం వరంగల్ BRS పార్టీలో మాల, మాదిగ నేతల మధ్య పోరు నడుస్తోంది.

వరంగల్ BRS టిక్కెట్ రేసులో మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్యతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న, ఎస్పీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. వీళ్ళల్లో పెద్ది స్వప్న పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జిల్లా పరిషత్ లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారామె. మాల సామాజిక వర్గంతో పాటు మహిళ కావడం స్వప్నకు కలిసొచ్చే అంశం. అలాగే గులాబీ పార్టీలో కీలంగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య కావడంతో గట్టిగా పైరవీ చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి కులాల ఓట్లు కూడా పడతాయని ఆమె వర్గీయులు వాదిస్తున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య మొదట్లో వరంగల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. అప్పట్లో అధిష్టానం కావ్యకు కేటాయించడంతో పార్టీ గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. కానీ కావ్య బయటకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు మళ్ళీ BRS టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వరంగల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మాదిగల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన రాజయ్య లేదా ఎర్రోళ్ళ శ్రీనివాస్ లో ఎవరికైనా ఇవ్వాలని మాదిగ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. రాజయ్యపై గతంలో అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నందున… కాంగ్రెస్ ఆయన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని కొందరు BRS నేతలు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అండతో… ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా వరంగల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ ఆయన సిద్ధిపేటకు చెందిన నేత కావడంతో… నాన్ లోకల్ కి ఇవ్వొద్దన్న డిమాండ్ వినిపిస్తోంది. వరంగల్ టిక్కెట్టుపై రెండు రోజుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.