BJP on SC Reservations: అనుకుంటాం గానీ..అన్నీ అవుతాయా? వర్గీకరణతో మాదిగల ఓట్లకు బీజేపీ గాలం
తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు బీజేపీ బీసీ (BJP B.C) అస్త్రాన్ని ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే.. ఆ పార్టీ బొక్క బొర్లా పడింది. అదే టైమ్ లో ఎస్సీ వర్గీకరణకు కూడా ఓకే చెప్పింది.
తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు బీజేపీ బీసీ (BJP B.C) అస్త్రాన్ని ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే.. ఆ పార్టీ బొక్క బొర్లా పడింది. అదే టైమ్ లో ఎస్సీ వర్గీకరణకు కూడా ఓకే చెప్పింది. ఎన్నికల్లో బీసీలతో పాటు మాదిగల ఓట్లు కూడా పడిపోతాయి. అధికారం దక్కడమే తరువాయి అనుకుంది. కానీ అన్నీ అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి అన్నట్టు.. ఆ రెండూ కలసి రాలేదు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం (Central Government). ఈసారి లోక్ సభ ఎన్నికలకైనా మాదిగల ఓటు బ్యాంక్ టర్న్ అవుతుందని కమలం పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సికింద్రాబాద్ లో మాదిగల విశ్వరూప సభ జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం గుర్తించామనీ.. వర్గీకరణకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్టే ఇప్పుడు ఛైర్మన్, ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం అంటూ ఇప్పుడు తెలంగాణ, ఏపీల్లో మాదిగల ఓట్ బ్యాంక్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఎస్సీ వర్గీకరణ జరిగితే.. చిట్ట చివరి దళితుడికి కూడా న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు మోడీ చెప్పినా.. అప్పడు మాదిగల నుంచి పెద్దగా ఓట్లు రానట్టుగా అర్థమైంది. కనీసం ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు కూడా బీజేపీకి దక్కలేదు. కానీ ఇప్పుడు కమిటీ వేయడం వల్ల.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎస్సీ వర్గీకరణ జరగడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. మోదీ గ్యారెంటీ కింద ఈ కమిటీ నియామకం జరిగిందనీ.. ఇప్పుడు మాదిగలు తమ వైపే ఉన్నారంటున్నారు బీజేపీ లీడర్లు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని చెబుతున్నారు.
తెలంగాణలో దళితుల ఓటు బ్యాంక్ (Dalit Vote Bank) సాధారణంగా కాంగ్రెస్ కే ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టడానికి బీజేపీ లోక్ సభ ఎన్నికల ముందు మరో అస్త్రం ప్రయోగించింది. ఇదైనా వర్కవుట్ అవుతుందా అన్నది ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక తేలనుంది.