రేవంత్ టార్గెట్ జగన్, హైడ్రా టార్గెట్ ఇదే
హైడ్రా… ఇప్పుడు ఈ పేరు వింటే చాలు హైదరాబాద్ లో అక్రమాలు చేసిన వాళ్లకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అక్కినేని నాగార్జునకె దిక్కు లేదు మా పరిస్థితి ఏంటీ అని చాలా మంది రాజకీయ నాయకులు సైతం భయపడిపోతున్నారు. ఈ వారంలో ఏ పరిణామాలు ఉంటాయో అనే దానిపై హైదరాబాద్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు బయటకు వచ్చిన ఒక విషయం మాత్రం ప్రకంపనాలకు వేదిక అవుతోంది. అసలు సిఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటీ అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది.
రేవంత్ రెడ్డి ముగ్గుర్ని టార్గెట్ చేసారని ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చ మొదలయింది. ఒకటి కేటిఆర్, రెండు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మూడు వైఎస్ జగన్. ఈ ముగ్గురినే రేవంత్ టార్గెట్ చేసారు. ఈ ముగ్గురికి చెందిన భవనాలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిల్లో అక్రమాలకు పాల్పడినవి ఉన్నాయి. కేటిఆర్ జన్వాడ ఫాం హౌస్ ను ఎలా అయినా కూల్చాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో హైకోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో కూడా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇప్పుడు వైఎస్ జగన్… రేవంత్ రెడ్డి టార్గెట్. కొందరు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి జగన్ తనను ఇబ్బందులకు గురి చేసారని రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ముందు లోటస్ పాండ్ వద్ద ఉన్న గోడలను కూలిస్తే పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత దానిపై రేవంత్ చాలా వ్యూహాత్మకంగా అధికారులపై చర్యలకు దిగారు. ఆ తర్వాతి నుంచి హైడ్రా స్పీడ్ పెంచింది. దాదాపు వందకు పైగా అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలకు దిగారు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చేశారు.
త్వరలోనే పల్లాకు చెందిన భవనాలను కూడా కూల్చేస్తారు. ఇందులో మార్పు అయితే ఏం లేదు. ఆ తర్వాత మజ్లీస్ పార్టీకి చెందిన భవనాలను కూలుస్తారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ పై ఫోకస్ పెడతారు. డైరెక్ట్ గా జగన్ పైకి వెళ్తే చంద్రబాబు ప్లానింగ్ అనే విషయం ప్రజలకు అర్ధమవుతోంది. అందుకే రేవంత్ ఒక ప్లాన్ తో వెళ్తున్నారని టాక్. రేవంత్ కు ఎన్ కన్వెన్షన్ తర్వాత ప్రజల్లో మద్దతు వచ్చింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ పై రేవంత్ అంతర్గతంగా ప్రసంశల వర్షం కురిపించారు. ఇప్పుడు హైడ్రా టార్గెట్ పెద్దది. ఆ టార్గెట్ కోసం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నాగార్జున ద్వారా సిగ్నల్ వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ వేయబోయే అడుగులు మాత్రం దేశంలోనే సంచలనం కాబోతున్నాయి అనే సిగ్నల్స్ బలంగా వస్తున్నాయి. అందుకే కొందరు రేవంత్ ను విమర్శించడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.