కనబడుట లేదు కెసిఆర్ ఇక లేనట్లే? “బ్లాస్టింగ్ బ్రేకింగ్”
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై అంటే.. రాష్ట్రముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్ గా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకు జరిగాయి.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై అంటే.. రాష్ట్రముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్ గా ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పటి వరకు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి సభలో విశ్వరూపం చూపిస్తున్నారు. రేవంత్ కు తోడుగా రూలింగ్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటి వరకు అంటకాగి, అధికారం పోగానే కాంగ్రెస్ కు జీ హుజూర్ అంటూ… BRSను ఏకిపారేస్తున్న MIM ను కూడా గులాబీ సభ్యులు బాగానే నిలువరిస్తున్నారు. కాంగ్రెస్, బిజేపీ, MIM, CPI ముప్పేట దాడి చేస్తున్నా సరే… KTR,హరీష్ రావు, పాడికౌశిక్ రెడ్డి హైరేంజ్ లోనే డిఫెన్స్ ఆడుతున్నారు. అయినా సరే భారీ వెలితి, తీర్చలేనిలోటు… పుష్ప మూవీలో షెకావత్ లా చెప్పాలంటే… ఒకటి తక్కువైంది పుష్పా! నిజంగానే ఆ ఒక్కటి తక్కువైంది పుష్పా! ఇంతకీ ఆ లోటు ఏమిటి? ఆ వెలితి ఎక్కడ?
పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరిని ఇప్పుడు వెంటాడి వేధిస్తున్న వెలితి ఒక్కటే. ఆ లోటు కు పేరు పెడితే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. షార్ట్ కట్ లో KCR. అవును కాంగ్రెస్ క్యాడర్ నుంచి గులాబీ దండు వరకు.. కాషాయ కరసేవకుల నుంచి కమ్యూనిస్టు కార్యకర్తల వరకు… కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా లేదా అని! నిజం మాట్లాడుకుంటే… ముందు చెప్పుకున్నట్లు సభలో పవర్ పార్టీని కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అండ్ కో ఒక ఆట ఆడుకుంటున్నా సరే … కోట్లాది కళ్ల జతలు మాత్రం వెతుకుతున్నది కేసీఆర్ కోసమే! తెలంగాణ శాసన సభలో నిల్చుని ఏ స్ధాయిలో కాంగ్రెస్ కు కౌంటర్లు ఇస్తారనేది చూడాలనే ఆశమాత్రమే. ఇప్పటి వరకు అయితే ఆ కల నెరవేరలేదు. ఇకముందు అయినా సరే కేసీఆర్ వస్తారా రారా అనేది గులాబీ బాస్ ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న.అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసి… అత్యంత కీలకమైన మరొక పాయింట్ ను దీని తర్వాత చూద్దాం. భవిష్యత్తులో అయినా సరే మాటల మాంత్రికుడు KCR అసెంబ్లీకి వస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే… ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ను మాత్రమే కాదు ఆయన మనస్తత్వాన్ని కూడా స్టడీ చేయాలి. చేసి తీరాలి. KCR అంటే మకుటం లేని మహారాజు. ఎవరినైనా సరే తన వాక్చాతుర్యంతో కట్టి పడేసే సమ్మోహన శక్తి ఉన్నవాడు. ఇది కేసీఆర్ బలం అయితే ఆదేశించటమే తప్పితే… చర్చను దాదాపు ఒప్పుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఒకవేళ బలవంతంగా చర్చకు కూర్చున్నా సరే నిలదీస్తే.. నిలవేస్తే అసలేమాత్రం భరించలేని తత్త్వం. ఎందుకంటే రాజరికం కనుమరుగై..రాజులే లేని ఈ కాలంలో తనకు తాను రాజుగా భావించుకునే తత్త్వం ది గ్రేట్ కేసీఆర్ ది. దీనికి తగ్గట్లుగానే ఆయన అడుగులకు మడుగులు వత్తే వంది మాగధులు కూడా… అంటే భజన బ్యాచ్ కూడా కేసీఆర్‌ను రాజుగానే చూస్తారు. ఆయన్ను అలాగే చూడాలని చాటింపు వేస్తారు. KCR అసెంబ్లీకి రాకపోవడానికి, రాలేకపోవటానికి కారణం ఇదే! ఏ సభలో అయితే నాయకుడిగా ఉండి గర్జించాడో.. అదే సభకు ప్రతిపక్షనేతగా ఎలా వస్తాడు? ఏ సభలో అయితే కనుసైగలతో శాసించాడో, అదే సభకు వచ్చి మరొకరిని సభానాయకుడిగా ఎలా ఒప్పుకుంటాడు? మైక్ కోసమో, అవకాశం కోసమో స్పీకర్‌కు ఎలా మొరపెట్టుకుంటాడు? నెవ్వర్ అండ్ నెవ్వర్. అన్నింటికి మించి సీఎం రేవంత్ రెడ్డి ట్రోలింగ్‌ను కేసీఆర్ ఎలా భరించగలరు, ఎలా తట్టుకోగలరు? కాంగ్రెస్,BJP, MIM,CPI ఒక్కటై ఆడుకుంటే కూల్ కేసీఆర్ కూల్ అంటూ తనకు తానే ఎలా సర్ధి చెప్పుకోగలరు? అసలు సాధ్యమయ్యే పనేనా? No Not At All.. రాబోయే 4 ఏళ్లలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఒకవేళ వచ్చినా పదవికి ముప్పురాకుండా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోతారే కానీ… తెలంగాణ అసెంబ్లీకి మాత్రం కేసీఆర్ పెట్టబోయేది ఎగనామమే!
అసెంబ్లీకి రాకపోతే సరే.. మరి ప్రజాక్షేత్రంలోకి వస్తారా లేదా? ఈ ఏడాది కాలంలో పుట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పై వ్యతిరేకతను ఎండగట్టేందుకు అయినా సరే పెద్దాయన వస్తారా లేదా… ఇదే ఇప్పుడు తప్పనిసరిగా డిస్కస్ చేసి గుర్తు ఉంచుకోవాల్సిన పాయింట్! అది 1989 నుంచి 1994 మధ్య కాలం, ఇంకా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే KCR సిద్ధిపేటకు MLAగా ఉన్న కాలం! సిద్ధిపేట నియోజకవర్గంలో కేసీఆర్ ఎక్కని గడపలేదు. దిగని మెట్లు లేవు. నియోజకవర్గం అంతా సుడిగాలిలా పర్యటించారు. ఏఏ గ్రామాల్లో సమస్యలు తిష్ఠ వేసాయో… వాటన్నింటిని చుట్టేసారు. అన్నింటిని నోట్ చేసుకున్నారు. సర్కార్ పై సమరం ప్రకటించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. పల్లెల్లో నిద్రలు చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే లీడర్ అంటే ఇలా ఉండాలిరా .. లీడర్ అంటే ఇలాగే ఉండాలి రా అని యావత్ భారతావనికి నిరూపించారు. అంతే అక్కడితో ఆగిపోయింది ప్రజలతో కమ్యూనికేషన్. ఈ 5ఏళ్లు మాత్రమే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాదు కాదు తలలో నాలుకలా ఉన్నారు. ఆ తర్వాతి కాలం అంతా చుట్టపు చూపు రాకపోకలే. ఇక 1998లో అంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమ సమస్యల సాధనకోసం ఆర్టీసీ కార్మికులు 24 రోజులు సమ్మె చేసారు. ఎవరూ చెప్పినా వినలేదు. ఎవరే ప్రతిపాదనలు పంపినా సరే తగ్గలేదు.
ఆనాడు రవాణాశాఖామంత్రిగా ఉన్న కేసీఆర్ అసలు… RTC కార్మికుల సమ్మె గురించి పట్టించుకోలేదని, చర్చించాలనే ప్రతిపాదనే వినలేదని, నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్ని సార్లు కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా సరే రెస్పాండ్ అవలేదని సీనియర్ జర్నలిస్టులు, కేసీఆర్ రాజకీయ సహచరులు నేటికి చెబుతారు. అంటే దేన్నైనా పరిగణలోకి తీసుకోవాలంటే కేసీఆర్ మాత్రమే అనుకోవాలి. దేన్ని పక్కన పెట్టాలని డిసైడ్ అవుతారో … అయ్యారో.. అంతే ఒక్కసారి కమిట్ అయితే పండుగాడు తన మాటే తానే వినడనే పోకిరి డైలాగ్ కు వందకు పదింతలు పంతం ఆయనది. అర్ధమైనట్లే ఉండి అసలే మాత్రం అర్ధం కాని గులాబీ బాస్… ప్రజాక్షేత్రంలోకి వస్తారు, వచ్చి గర్జిస్తారు, ఘీంకరిస్తారు, జూలు విదిలిస్తారు అనే అత్యాశకు ఇక ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. నేను ఇక రాను, రాలేను.. పార్టీని నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరు కనుక యాక్టివ్ కాకపోతే పార్టీ మిగలడం కష్టం. మీలో మీరు కొట్టుకుంటే ఉన్న ఆ కాస్త ఎమ్మెల్యేలు కూడా జారిపోతారు. కాబట్టి జనంలోకి వెళ్లండి, జనజాతర పుట్టించండి. కాంగ్రెస్ సర్కార్ తాట తీయండి అంటూ KTR,కవిత,హరీష్ రావుకు కర్తవ్యబోధ మాత్రమే కాదు హితబోధ కూడా చేసారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ సాక్షిగా ఈ దిశానిర్ధేశనం జరిగిన మాట నిప్పులాంటి నిజం.అందుకే కవిత,కేటీఆర్, హరీష్ రావు దూకుడు పెంచారు! జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నేడో రేపో జైలుకు పోవడం ఖాయమని తెలిసినా సరే కేటీఆర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. జైలు నుంచి వచ్చాక కొన్నిరోజులు సైలైంట్ మోడ్ లోకి వెళ్లినా..డబుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు కవిత. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే రీతిలో పనికానిచ్చేస్తున్నారు హరీష్ రావు. సో ఇట్స్ క్లియర్ దట్….. కేసీఆర్ అసెంబ్లీకి రారు… ఏదో అద్భుతం జరిగితే తప్పితే ప్రజాక్షేత్రంలోకి రారు.. మరీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను తొక్కేసి BRS పవర్ లోకి వస్తే…. సీఎం కేసీఆర్ అవుతారా, KTR,కవిత,హరీష్ రావు కానిస్తారా…? ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ ఒక్కరే! లెట్స్ వెయిట్ అండ్ సీ!