వరద బాధితుల కోసం ఒక్క మాట లేదు, రూపాయి నోటు తీయలేదు
నను తాను తెలంగాణ బాపుగా ప్రకటించుకున్న కేసీఆర్ కి అధికారం పోయిన... అహంకారం మాత్రం పోలేదు. అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి, చూసుకోండి రేపటి నుంచి భూకంపం పుట్టిస్తానని ప్రకటించి పరార్ అయిపోయిన కేసీఆర్... మళ్లీ జనానికి కనిపించలేదు.
తనను తాను తెలంగాణ బాపుగా ప్రకటించుకున్న కేసీఆర్ కి అధికారం పోయిన… అహంకారం మాత్రం పోలేదు. అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి, చూసుకోండి రేపటి నుంచి భూకంపం పుట్టిస్తానని ప్రకటించి పరార్ అయిపోయిన కేసీఆర్… మళ్లీ జనానికి కనిపించలేదు. అన్నిటికంటే దారుణం తెలంగాణలో వరదలు వచ్చి వేలకోట్లు రూపాయలు నష్టం జరిగిన… వరద బురదలో జనం అష్టకష్టాలు పడుతున్న ఫామ్ హౌస్ ని వదిలి వచ్చి , జనం వంక కన్నెత్తైనా చూడలేదు బి ఆర్ ఎస్ అధినేత.
అధికారంలో ఉన్న పదేళ్లు రాజరిక పోకడలే. తన అవసరానికి తప్పించి జనం అవసరాలకు ఏనాడు కెసిఆర్ కదిలి రాలేదు. తాను నివాసం ఉండే ప్రగతి భవన్ కు, ఫామ్ హౌస్ కు జనాన్ని రానివ్వ లేదు. కెసిఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు చాలా ఉపద్రవాలు వచ్చాయి. జనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్లకి అండగా నిలబడి వాళ్ల కన్నీళ్లు తుడిచే బాధ్యతను ఏనాడూ తీసుకోలేదు కేసీఆర్.2018 సెప్టెంబర్ లో కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 60 మంది చనిపోయారు. దానికి కూడా చలించలేదు ఆయన. కనీసం వెళ్లి బాధితులని పరామర్శించలేదు. చావంటే అంత భయమేమో కెసిఆర్ కి. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు, వరదలు వచ్చి జనం ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు, ఊహించని సంఘటన జరిగినప్పుడు ఏనాడు బాధితులకు అండగా నిలబడిన సందర్భాలు లేవు. మనం చక్రవర్తులం…. ప్రభువులం మనం ఇలాగే ఉండాలి అనుకుంటారు ఆయన. హైదరాబాదులో నిర్భయ హత్యాచారం జరిగినప్పుడు…. దేశమంతా కదిలిపోయింది. ఆయనలో మాత్రం కదలిక రాలేదు. వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని కనీసం పరామర్శించలేదు.
మంత్రుల, ఎమ్మెల్యేల ఇళ్లల్లో పెళ్లిళ్లు, పేరంటాలు, పెదకర్మలకు మాత్రం కెసిఆర్ బాగా హాజరయ్యేవారు. కానీ జనం సమస్యల్లో ఉన్నప్పుడు
కెసిఆర్ వెళ్లి ఓదార్చింది ఏనాడు లేదు. తప్పదు అనుకుంటే కేటీఆర్ ను, హరీష్ రావును పంపేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఖమ్మంలో మున్నేరు వాగు కాలనీలు కాలనీ లని ముంచేసింది. పాలేరు కూడా వరదలకు భారీగా నష్టపోయింది. మహబూబాబాద్ లో 45 సెంటీమీటర్ల వాన పడి జనజీవనం అతలాకుతలం అయిపోయింది.
కెసిఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో మందు కొడుతూ ,టీవీ చూస్తూ..
రిలాక్స్ అయ్యారు. ఒకరోజు మాత్రం హరీష్ రావు ఖమ్మం వెళ్లి హడావుడి చేసి వచ్చేసారు. కెసిఆర్ కు తెలంగాణలో ప్రజలపై చాలా నమ్మకం ఎక్కువ. ఐదేళ్లపాటు మనం ఏం చేసినా చేయకపోయినా, ప్రభుత్వం మీద వ్యతిరేకితే మనల్ని గెలిపిస్తుందని అప్పటివరకు అనవసరంగా శ్రమ పడడం శుద్ధ దండగని భావిస్తారు కేసీఆర్. ఉద్యమం సమయంలోనూ ఆయన ఏనాడూ రోడ్డు ఎక్కింది లేదు. ఊరికే ప్రచారం తప్ప. కేటీఆర్ అమెరికాలో, కెసిఆర్ ఫామ్ హౌస్ లో రిలాక్స్ అవుతుంటే రోడ్లపై రాజకీయాన్ని హరీష్ రావు నడిపిస్తున్నారు.
కానీ వరదల్లో సర్వం పోగొట్టుకున్న జనానికి మాత్రం టిఆర్ఎస్ నేతలు గాని, కెసిఆర్ కుటుంబం గానీ చేసింది శూన్యం. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఒకరోజు జీతాన్ని మాత్రం బాధితుల కోసం లంచనంగా ప్రకటించారు. వందల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ అధికార ఖాతాలో ములుగుతున్నాయి. ఎలక్షన్ బాండ్స్ ద్వారా ఎన్నికలకు ముందు వందల కోట్ల రూపాయలు సేకరించారు కేసీఆర్. అవన్నీ అకౌంట్లో అలాగే ఉన్నాయి. వాటిలో ఒక్క పది కోట్లు రూపాయలు తీసి వరద బాధి ఖర్చు పెట్టి ఏంటో బయట పడేది ఏంటో బయట పడేది. డబ్బులు సంగతి దేవుడెరుగు బాధితుల కోసం కనీసం ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. ఎలాగో నాలుగేళ్లు జనంతో అవసరం లేదు ఇప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించడం పెట్రోల్ ఖర్చు దండకం ఉంటాడు బి ఆర్ ఎస్ అధినేత. అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కెసిఆర్ తాను కొట్టేసిన లక్ష కోట్లలో రెండు వేల కోట్లు వరద బాధితులకు ఇవ్వాలని ఆఫ్ ద రికార్డు డిమాండ్ చేశారు కూడా. దానికి కూడా స్పందించలేదు కెసిఆర్. తానే తెలంగాణ తెలంగాణ తాను అని చెప్పుకునే bi ఆర్ఎస్ అధినేత జనం కోసం ఒక్క మాట గాని, ఒక్క రూపాయి కానీ బయటకు తీయకపోవడం జనం ఆలోచించాల్సిన విషయం.