Kavitha : ఇక కవిత అరెస్ట్ తప్పదు ?
లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో త్వరలోనే కవిత అరెస్ట్ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ కవితను సాక్షిగా మాత్రమే చూసిన అధికారులు ఇప్పుడు నిందితురాలిగా చేర్చారు. లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి మెయిల్ చేశారు.

Will Kavitha be arrested in the Delhi liquor scam case?
లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో త్వరలోనే కవిత అరెస్ట్ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ కవితను సాక్షిగా మాత్రమే చూసిన అధికారులు ఇప్పుడు నిందితురాలిగా చేర్చారు. లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి మెయిల్ చేశారు. కోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా.. తాను విచారణకు రాలేకపోతున్నానంటూ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ, సీబీఐ (CBI) అధికారులు పలుమార్లు కవితను ప్రశ్నించారు. విచారణ సరిగ్గా జరడంలేదంటూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఈ పిటిషన్‌ను చూపి తాను విచారణకు రాలేనని చెప్తున్నారు కవిత. అయితే మొన్నటి వరకూ సీన్ వేరు.. ఇప్పుడు సీన్ వేరు. మొన్నటి వరకూ కవిత ఈ కేసులో కేవలం సాక్షి మాత్రమే. కానీ ఇప్పుడు నిందితుల్లో ఒకరు. అందుకే అధికారులు కూడా సీఆర్‌పీసీ 160 నోటీసులు కాకుండా 41ఏ నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలంటూ పిలిచారు. గతంలో ఇంట్లో విచారించిన మాదిరిగా ఇప్పుడు కూడా ఇంట్లో విచారించాలని కవిత కోరుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కవిత మాత్రం తన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకూ విచారణకు రానంటూ తెగేసి చెప్పారు. దీంతో ఈసారి పక్కాగా కవితను అరెస్ట్ (Kavita Arrest) చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా కవిత విచారణకు వెళ్లినప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకును కవితను పంపించారు అధికారులు. కానీ ఇప్పుడు నిందితుల జాబితాలో చేర్చిన తరువాత కూడా కవిత విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ తప్పదు అనే వాదన వినిపిస్తోంది. కవిత మెయిల్‌కు సీబీఐ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది. విచారణకు వేరే తేదీ ఇస్తారా.. లేక అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి.