కవితకు బెయిల్! బీఆర్‌ఎస్ బలగం ఢిల్లీకి అందుకేనా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై.. మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగనుంది. ఇప్పటికే చాలాసార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ప్రతీసారి నిరాశే మిగిలింది. మంగళవారం కవిత, బీఆర్ఎస్ శ్రేణులు గుడ్‌న్యూస్ వినబోతున్నాయా.. ఆమెకు బెయిల్ గ్యారంటీగా వస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లడం.. కవితకు బెయిల్ గ్యారంటీ అనే ప్రచారాన్ని మరింత బలంగా మారుస్తోంది.
కేటీఆర్, హరీష్‌తో పాటు 20మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని.. ఆమెకు స్వాగతం పలికేందుకే కేటీఆర్ అక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ శ్రేణులు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాయ్. మార్చి 15నుంచి కవిత జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అసలేం బాలేదు. ఇక అటు ఇదే కేసులో నిందితులకు వరుసగా బెయిల్ వస్తోంది. ఈ మధ్యే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ ఇచ్చింది. పైగా కవిత తరఫున ప్రమఖ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ ఖాయం అని బీఆర్ఎస్ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని.. కేటీఆర్ గతంలోనే ధీమా వ్యక్తం చేశారు. ఐతే అలా జరగలేదు. ఇప్పుడు మాత్రం కేసులో విచారణ దాదాపు ఫైనల్ స్టేజీకి రావడంతో.. సీబీఐ, ఈడీ కూడా.. బెయిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. దీంతో అన్నీ ఆలోచించే.. ఆమెకు ఘన స్వాగతం చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. కవితకు మంగళవారం బెయిల్ లభిస్తే … తీహార్ జైలు నుంచి ఆమెకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. తర్వాత కవిత రాజకీయ భవిష్యత్ పై ఆమె నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కవితకు బెయిల్ వస్తే.. తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశం ఉంది. కేసీఆర్ చాలా కాలంగా బయట కనిపించడం లేదు. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. కవిత జైల్లో మగ్గిపోతూండటం వల్లనే ఆయన మానసిక వేదనకు గురవతున్నారని.. కకవిత విడుదలైన తర్వాత కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.