Home » Uncategorized
మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రకారం.. 2025 అక్టోబర్ నుంచి విండోస్ 10పై ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ రావు. ఆ కంప్యూటర్లు వాడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతాయి.
పోలీసుల కళ్లు గప్పి.. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్ వద్ద) డబ్బులను అమర్చారు. డబ్బుల నోట్ల కట్టలను కారు ఇంజన్ లో ఉంచి తరలిస్తుండగా.. హీట్ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది.
గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు వంద మంది వరకు మరణించారని అధికారులు తెలిపారు. 400 మందికిపైగా వడదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో అనేక రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది.
2027 వరకు ఇండియా-థాయ్‌లాండ్ మధ్య రోడ్డు మార్గం అందుబాటులోకి రాబోతుంది. దీనికోసం కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే థాయ్‌లాండ్‌కు పర్యాటకంగా మేలు జరిగితే.. వాణిజ్య పరంగా ఇండియాకు లాభం కలుగుతుంది.
బిపర్జాయ్ తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వివిధ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించే అమెరికా ఓ ఆయుధ ఒప్పందం విషయంలో చాలా కాలంగా మనదేశం వైపే చూస్తోంది. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టనుండటంతో బైడెన్ ప్రభుత్వం ఈ డీల్‌ను ఓకే చేయించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.
గురువారం మధ్యాహ్నం గుజరాత్, కచ్ జిల్లా, జఖౌ వద్ద తీరాన్ని తాకుతుంది. బిపర్జాయ్ భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉండటంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దాదాపు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అత్యంత రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా భద్రంగా ఉండాల్సిన పత్రాలు ఎక్కడున్నాయో తెలుసా..? ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ రిసార్ట్ మర్-అ-లాగోలో. పెంటగాన్ ప్రధాన కార్యాలయంలోనో.. లేక వైట్ హౌస్ ఆఫీసులోనో ఉండాల్సిన రహస్య పత్రాలు.. ఏకంగా ట్రంప్ పర్సనల్ రిసార్ట్‌లో కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి.
ఇప్పటికే న్యూయార్క్ నగరాన్ని కమ్మేసిన పొగ.. ఇప్పుడు వాషింగ్టన్‌ను కూడా ముంచేసింది. దీంతో న్యూయార్క్‌తోపాటు వాషింగ్టన్లోనూ జనజీవనం స్తంభించింది. అట్లాంటిక్ తీర ప్రాంతంలోనూ పొగ ప్రభావం ఉంది. గురువారం వాషింగ్టన్లో పొగ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
27 సంవత్సరాల తర్వాత ఇండియాలో ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. మన దేశంలో చివరగా 1996లో ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ పోటీలకు భారత్ వేదిక కానుండటం విశేషం.