Alien Signal: ఏలియన్స్ నుంచి భూమికి సందేశం అందిందా..? ఆ కోడ్ రహస్యం ఏంటి?

భూ గ్రహానికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి భూమికి ఒక కోడ్ వచ్చింది. దీన్ని ఏలియన్సే పంపించి ఉంటారని అంచనా. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసిన సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేజ్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌ (టీజీఓ) గుర్తించి, భూమికి చేరవేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2023 | 01:03 PMLast Updated on: May 26, 2023 | 1:03 PM

Earth Receives Alien Signal From Mars

Alien Signal: ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) నిజంగా ఉన్నారా.. లేదా.. అనే విషయంలో చాలా సందేహాలున్నాయి. కానీ, భూమిలాగే ఏదో ఒక గ్రహంపై కచ్చితంగా జీవరాశి ఉండే ఉంటుందని శాస్త్రవేత్తల నమ్మకం. ఏలియన్స్ గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అలాగని ఏలియన్స్ ఉన్నారనే విషయాన్ని కొట్టిపారేయలేమని సైంటిస్టులు చెబుతుంటారు. ఈ వాదనకు బలాన్నిచ్చే సంఘటన ఒకటి తాజాగా జరిగింది. భూ గ్రహానికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి భూమికి ఒక కోడ్ వచ్చింది. దీన్ని ఏలియన్సే పంపించి ఉంటారని అంచనా.

అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసిన సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేజ్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌ (టీజీఓ) గుర్తించి, భూమికి చేరవేసింది. ఇలా ఇతరగ్రహాల నుంచి ఎన్‌కోడెడ్‌ సమాచారం రావడం ఇదే మొదటిసారి. అంగారక గ్రహం నుంచి వచ్చిన సమాచారాన్ని 16 నిమిషాల్లోనే టీజీఓ భూమికి చేర్చింది. అంగారక గ్రహం నుంచి వచ్చిన ఈ కోడ్‌ను డీకోడ్ చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది గ్రహాంతర వాసులే పంపించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నేళ్లుగా ఏలియన్స్ విషయంలో జరుగుతున్న పరిశోధనల్లో ఇది ముందుడుగు అవుతుంది.
గతంలో అంగారక గ్రహం నుంచి ఇలాంటి కోడ్ ఎప్పుడూ రాలేదు. ఈ సారి కోడ్ రావడం ఆశ్చర్యంగా ఉంది. టీజీఓ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతుంది.

బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు అంగారక గ్రహం నుంచి వచ్చిన ఒక మెసేజ్‌ను ఎన్‌కోడ్ చేసి కనిపెట్టింది. వెంటనే దాన్ని భూమికి పంపించింది. 16 నిమిషాల్లోనే టీజీఓ నుంచి ఆ కోడ్ భూమిని చేరింది. ఈ కోడ్ రిసీవ్ చేసుకున్న శాస్త్రవేత్తలు దాన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. అయితే, ఇది ఏలియన్సే పంపించారా అనే విషయంలో స్పష్టత లేదు. లేదా అంతరిక్షంలో ఏదైనా పేలుడు వల్ల ఏర్పడ్డ సంకేతమా అని తేలాల్సి ఉంది. అయితే, ఈ కోడ్ ఏలియన్స్ విషయంలో సాగుతున్న పరిశోధనల్లో ఎంతో ఉపయోగపడుతుంది. కానీ, ఈ దీన్ని డీకోడ్ చేయడం శాస్త్రవేత్తలకు కష్టంగా మారింది. అందుకే దీన్ని డీకోడ్ చేసే అందరికీ కల్పిస్తున్నారు. ఒక వెబ్‌సైట్‌లో ఈ కోడ్ సిగ్నల్స్‌ను పొందుపరిచారు. ఆసక్తి ఉన్న వాళ్లెవరైనా దీన్ని డీకోడ్ చేయొచ్చు. మీకూ ఆసక్తి ఉంటే ట్రై చేయొచ్చు. ఏలియన్స్ భూమిని సందర్శించారని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనికి సరైన ఆధారాలు లేవని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో స్పష్టం చేశారు. ఏదేమైనా ఏలియన్స్ గురించి అనేక థియరీలో ప్రచారంలో ఉన్నాయి. వీటి విషయంలో నిజానిజాలేంటో మాత్రం తెలియదు.