TELANGANA BUDGET: తెలంగాణ బడ్జెట్ 2023-24 – అసెంబ్లీలో ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం

TAMILISAI ASSEMBLY MEETING
కాళోజీ కవితతో గవర్నర్ తమిళసై తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023 సమావేశాలు ప్రారంభమయ్యాయి. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చాటిన ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు కవితతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం. రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి. ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నాం. ఈ ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు గవర్నర్ తమిళిసై. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు..కలెక్టర్ ప్రమేల సత్పతి, ఇంచార్జ్ ఈవో రామకృష్ణారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. తూర్పు త్రితల రాజగోపురం వద్ద తమిళిసైకి పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. దర్శనానంతరం ఆశీర్వచనాలు అందించారు. కొంతకాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాల నేపథ్యంలో..గవర్నర్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.